Womaania : 15 ఏళ్ల పాటల వేడుకకు రంగం సిద్ధమైంది. ‘వోమానియా’ పాటల ప్రపంచం శ్రోతలను పిలుస్తోంది. లక్ష్మీ దేవినేని సమర్పణలో ఈ వేడుక సెప్టెంబర్ 29న 1050 కింగ్ జార్జియెస్ పోస్ట్ ఆర్డీ ఫోర్డ్స్ , న్యూజెర్సీలో నిర్వహిస్తున్నారు. ఇందులో పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డ్రాలు సహా సర్వం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సింగర్స్ సౌజన్య, శృతినండూరి, స్ఫూర్తిలు హాజరై పాటలు పాడనున్నారు. ఈ కార్యక్రమ టికెట్ ఖరీదును 25 డాలర్లుగా నిర్ణయించారు. లక్కీ డ్రా విజేతలకు డైమండ్ రింగ్ రాఫెల్ బహూకరించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని సుగుణ సి, సౌమ్య, డోల్జ్, శిల్ప, వాసంత, రోజా, సురీషా, శివాణీ, బిందు, దుర్గ, పద్మజ, సునీత, నాగమణి, రాణి, సరిత, లత, నాగలక్ష్మీలు కలిసి టీం ‘వోమానియాగా’గా ఏర్పడి నిర్వహిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జైస్వరాజ్య టీవీ, జైఎస్.డబ్ల్యూ స్పాన్సర్ గా వ్యవహరిస్తుండడం విశేషం.
పూర్తి వివరాలను పైన పాంప్లెట్ లో చూడొచ్చు.