అమెరికాలోని ఎడిసన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ”worlds largest Go – kart track ”. డిసెంబర్ 19 న ఎడిసన్ లో మేయర్ సామ్ జోషి చేతుల మీదుగా ప్రారంభించబడింది. హాలీడేస్ లో ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేసేలా ఆకర్షణగా తీర్చిదిద్దారు. ఈ గో కార్ట్ ట్రాక్ ప్రపంచంలోనే అతిపెద్దది కావడం విశేషం. ఈ గో కార్ట్ కు అద్భుత స్పందన వచ్చింది.
న్యూజెర్సీ లోని ఎడిసన్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎడిసన్ లో ఎక్కువగా ప్రవాసాంధ్రులు ఉంటారన్న విషయం తెలిసిందే. వాళ్లకు ఇదొక మంచి ఆటవిడుపు అనే చెప్పాలి. గో కార్ట్ ఎడిసన్ లో ఏర్పాటు చేయడం పట్ల మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎడిసన్ వాసులు ముఖ్యంగా ప్రవాసాంధ్రులు.