
Largest Traffic Jam : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు మహాకుంభమేళా మరో 16 రోజుల్లో ముగియనున్న వేళ దేశ విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ కు పోటెత్తారు. రహదారులు వాహనాలతో నిండిపోయాయి. మహా కుంభమేళాకు దారి తీసే మార్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
రహదారులపై చిక్కుకొని లక్షలాది భక్తులు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రద్దీ కారణంగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు ప్రయాణం రెండు రోజులు వాయిదా వేసుకోవాలని మధ్యప్రదేశ్ సీఎం కోరడం గమనార్హం.