29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Railway History Kavach : రైల్వే చరిత్రలో దారుణ ప్రమాదం.. తెరపైకి మరోసారి ‘కవచ్’

    Date:

    railway history Kavach
    railway history Kavach

    Railway history Kavach : దేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద ఘోర రైలు ప్రమాదం ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి సుమారు 233 మంది ప్రయాణికులు మరణించగా, సుమారు వెయ్యి మంది వరకు గాయపడినట్లు తెలుస్తున్నది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అన్వేషిస్తున్నది.

    శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని హావ్ డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద పట్టాలు తప్పడంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. సాయంత్రం 7గంటలకు షాలిమార్ – చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ 128 కిలో మీటర్ల వేగంతో ఆ బోగీలను ఢీకొట్టింది.

    సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుందట. కానీ ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే వేగం జీరో కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న బోగీలను కోరమండల్ ట్రైన్ ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.

    అనంతరం ఈ బోగీలను మరో గూడ్సు రైలు ఢీకొంది. అయితే ఘటనపై ప్రత్యక్ష సాక్షుల కథనం, స్థానిక సిబ్బంది కథనం వేర్వేరుగా ఉన్నయి. ఏదేమైనా పూర్తి విచారణకు కేంద్ర రైల్వేశాఖ ఆదేశించింది. త్వరలోనే ఇది మానవ తప్పిదమా.. సాంకేతిక లోపమా తేలనుంది.


    తెరపైకి కవచ్ టెక్నాలజీ..

    ఘటనాస్థలంలో ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం ఇది ఘోర వైఫల్యాంగానే కనిపిస్తున్నది. ఇదే సమయంలో కవచ్ టెక్నాలజీ అవసరాన్ని అంతా చర్చిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థే ఈ ‘కవచ్’ . రెండు రైళ్లు ఒక ట్రాక్ లో వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఆగిపోయేలా  పనిచేస్తుంది. దీంతోపాటు ఈ టెక్నాలజీ రైళ్లను వెనక్కి కూడా నడిపిస్తుంది. దీంతో ఏ రెండు రైళ్లు కూడా ఢీకొనే అవకాశమే ఉండదు.

    అయితే ఈ వ్యవస్థ మరి అమల్లో ఉందా లేదా అనేది రైల్వే శాఖకే తెలియాలి. ఇలాంటి రక్షణ వ్యవస్థ అందుబాటులో ఉన్నా ఈ ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేశాఖ పనితీరుపై ఎన్నో సందేహాలను రేపుతున్నాయి. ఇప్పటికే గత ఐదారేండ్లుగా రైల్వేశాఖ పనితీరుపై ప్రయాణికులు పెదవివిరస్తున్నారు. అసలు కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే వ్యవస్థను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రమాదం కూడా వారి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uttarpradesh : రైలు ఇంజిన్‌, బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి

    Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటు...

    Lokmanya Tilak-Shalimar Express : పట్టాలు తప్పిన నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్

    Lokmanya Tilak-Shalimar Express : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు...

    Jharkhand : ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం..  ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన  హౌరా ఎక్స్‌ప్రెస్

    Jharkhand : హౌరా-ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12810) రైలు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో...

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...