
no ball : క్రికెట్ లో క్షణక్షణానికి ఆట మారుతూ ఉంటుంది. మిస్సయిన ఒక క్యాచ్, ఫీల్డింగ్, అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా ఒక్కోసారి ఆట స్వరూపాన్నే . మార్చి వేస్తుంది. ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది. ఇది ఓ ఆటగాడికి కలిసి వచ్చింది. ఒక్క నోబాల్ తో ప్రమాదాన్ని తప్పించుకున్న ఆ ఆటగాడు జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకంగా మారాడు.
అయితే ఈసారి ఆ అదృష్టం చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ కు దక్కింది. ప్రస్తుతం ఐపీఎల్ లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం తలపడింది. ఈ మ్యాచ్లో ఒక అద్భుతం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ క్రీజులో ఉన్నాడు. నల్కండే వేసిన బాల్ ను మిడ్ వికెట్ మీదుగా కొట్టగా, గిల్ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ సమయంలో రుతురాజ్ కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఓపెనర్ అతి తక్కువ స్కోర్ కే అవుట్ అవడం సీఎస్కే ఆటగాళ్లను , అభిమానులను నిరాశకు నెట్టేసింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ బయట పడింది. అంపైర్ నోబాల్ అంటూ ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో సంబురం నెలకొంది. ఇక్కడ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద దొరికిపోయాడు. అంటే తొలిసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత 58 పరుగులు కొట్టాడు. అంటే చూశారుగా.. ఆటలో ఇవన్నీ సాధారణమే అయినా.. ఇలాంటివే ఆట స్వరూపాన్ననే మార్చేస్తాయని అనడంలో అతిశయోక్తి లేదు.