Trolls with AI images : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా పలు చిత్రాలను క్రియేట్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న నేతలకో, హీరోలనో అందులో ప్రమోట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమకు తెలిసిన వారికి పంపుతూ కొందరు ఆనందపడుతున్నారు. కొందరు వ్యంగ్యంగా వీటిని రూపొందిస్తూ, ఎదుటి వారిని ఆడుకుంటున్నారు.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. గతంలో జగన్ చేసిన అవినీతి, ఆయన పై ఉన్న కేసులను టీడీపీ నేతలు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఏవీ ద్వారా తయారు చేసిన ఒక చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇందులో చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ చిత్రాలతో వీటిని రూపొందించారు.
చంద్రబాబు చిత్రానికి స్కిల్ డెవలప్ మెంట్ అంటూ పలు కట్టడాలు, పరిశ్రమలు, కంపెనీలను పెట్టి ఆయన ఇమేజ్ ను రూపొందించారు. ఇక జగన్ బాత్రూమ్ లో రక్తపు మరకలు, గొడ్డలితో కిల్ డెవలప్ మెంట్ తయారు చేశారు. ఇది వైఎస్ జగన్ బాబాయ్ వివేకా హత్య జరిగిన తీరును గుర్తు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇది టీడీపీ నేతలే తయారు చేసి ఉంటారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఇమేజ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతున్నదిజ స్కిల్ డెవలప్ మెంట్ తో చంద్రబాబు అభివృద్ధి నినాదం ఎత్తుకుంటే, జగన్ మాత్రం కిల్ డెవలప్ మెంట్ అంటూ ఫ్యాక్షన్ రాజకీయాన్ని నడిపిస్తున్నాడని అందులో కామెంట్లు పెడుతున్నారు.