Dr. Shivakumar Anand : అమెరికాలో ఎన్నికల వేడి కనిపిస్తుంది. నవంబర్లో దేశ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్నాయి. కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలో నిలిచారు. వారిద్దరు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సెనెటర్ గా పోటీచేస్తున్న డబ్ల్యూ డబ్ల్యూ పీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి హనిఫ్ పాయక్(HANIF PAYAK)తో జై స్వరాజ్య/ జేఎస్ డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ డా. శివకుమార్ ఆనంద్ ముచ్చటించారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో మంచి మార్పు కోసం ఓటేయ్యాలని హనిఫ్ పాయక్ అమెరికన్ ఓటర్లకు సూచించారు.
ఆయన మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఒక విద్యావేత్త, తొలి సారిగా రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. ఆయన 18ఏళ్లుగా న్యూజెర్సీలో నివసిస్తున్నారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం అక్కడే నడిచింది. ఆయన చాలా బుక్ ఫెయిర్స్, స్కూల్ ఈవెంట్లలో పాల్గొన్నారు. విద్యారంగానికి ఆయన విశేష కృషి చేశారు. ఏ దేశానికైన బలం బలహీనత విద్యార్థులే. అందుకే వారి అభ్యున్నతికి మరింత కృషి చేసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు హనీఫ్ తెలిపారు.
ఆయనకు ఓటేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు గరిష్ట విలువను పెంచుతామని, జిల్లా నిర్ణయాలలో పారదర్శకతను తీసుకొస్తామన్నారు. అలాగే అకడమిక్ ఎక్సలెన్స్‌ని ప్రోత్సహిస్తామన్నారు. మానసిక ఆరోగ్యానికి తోడ్పాటు అందించడం, బెదిరింపు వ్యతిరేక చర్యలను మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే డిజిటల్ భద్రతను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
Full Video : One On One Interview with HANIF PAYAK WWP Board Of Education by Dr. Shivakumar Anand Chikine