
ఈ మధ్య కాలంలో చాలా జంటల కథలు విడాకులతో ముగిసాయి.. మరి తాజాగా మరో జంట విడాకులు తీసుకో బోతుంది అనే టాక్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. కమెడియన్ యాదమ్మ రాజు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఇతడు బుల్లితెర ప్రేక్షకులకు మరింత సుపరిచితం..
పటాస్ షోతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని వరుసగా అవకాశాలు అందుకుంటూ కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఈ కమెడియన్ ఇటీవలే స్టెల్లాను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ జంట పెళ్లి జరిగి ఏడాది కూడా కాకముందే విడిపోవడానికి సిద్ధం అవుతున్నారని తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
యాదమ్మ రాజు స్టెల్లా పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ వారికీ సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జంట ఒక డాన్స్ షోకు వెళ్లగా అక్కడ తాము విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పి షాక్ ఇచ్చారు. అయితే ఇది నిజం కాదని ఒక షో థీమ్ లో భాగంగా ఈ జంట విడిపోతున్నట్టు చెప్పుకొచ్చారు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తుంది. అయితే యాదమ్మ రాజు, స్టెల్లా జంట విడాకులు అంటూ ప్రచారం చేయడం నచ్చలేదని నెటిజెన్స్ అంటున్నారు. ఏది ఏమైనా వీరి విడాకుల మ్యాటర్ నెట్టింట వైరల్ అయ్యింది.
ReplyForward
|