Flood Disaster :
దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద తాండవం చేస్తోంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద తాకిడికి కార్లు కొట్టుకుపోతున్నాయి. భీతావహ దృశ్యాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజులుగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు వానకు వణికిపోతున్నాయి. యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో చాలా ప్రాంతాలు నీటిలో కొట్టుమిట్టాడాయి.
నదులు మహోగ్రరూపం దాల్చాయి. ఎటు చూసినా వరదలే దర్శనమిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్ని నీటిలో మునిగిపోతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భయం కలుగుతోంది. వరద మహోగ్ర రూపానికి అందరు బలవుతున్నారు. వరదకు వాహనాలే కొట్టుకుపోయాయి. కార్లు నీటి ప్రవాహంలో పడవల మాదిరి కొట్టుకుపోవడం గమనార్హం.
ఉత్తరాదిని వరదలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎటు చూసినా వరద ఉగ్రరూపమే కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, కశ్మీర్ వంటి రాష్ట్రాలు వరదలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జనావాసాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరద బీభత్సం చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే మనకే భయం కలుగుతుంది. దేశంలోని పలు ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద బారి నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ సహాయక చర్యలేవీ కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వరద బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.