IPL cricketer Yashasvi Jaiswal :
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అనే నానుడిని నిజం చేశాడు ఐపీల్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్. టాలెంట్ ఉంటే అవకాశాలతో పాటు పేరు డబ్బు వస్తుందని నిరూపించాడీ యువ క్రికెటర్.
కొందరికీ సత్తా ఉన్నా అవకాశాలు లేక మరుగున పడిపోతుంటారు. కానీ ముంబై స్టార్ క్రికెటర్ మాత్రం వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వనియోగం చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. క్రికెటర్ అయ్యేందుకు ఎంతగానో శ్రమించాడు. పేదరికం కారణంగా తండ్రి వెంట వెళ్లి పానీపూరీ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ఈ క్రికెటర్ ఇప్పడు ఇప్పుడు ముంబైలో ఓ పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. సొంత ఇంటి కల నెరవేరడంతో జైస్వాల్ ఎమోషనల్ అయ్యాడు.

జైస్వాల్ ప్రతిభావంతుడైన క్రికెటర్. ఈ క్రికెటర్ లోని ప్రతిభ వెలుగులోకి వచ్చింది మాత్రం ఐపీఎల్ 2023 సీజన్. ఈ ముంబై బ్యాట్స్‌మెన్ అండర్-19 వరల్డ్ ద్వారా మొదటిసారి తన ప్రతిభను చాటాడు. ఆ టోర్నమెంట్ లో తన బ్యాటింగ్ ధాటిని చూపించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020లో రాజస్థాన్ రాయల్స్ యశస్విని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. 2022లో రూ.4 కోట్లు ఆఫర్ చేసింది. ఈ ఐపీఎల్‌లో యశస్వీ ఆటతీరు అద్భుతం. ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీతో 600 పైగా పరుగులు సాధించాడు. ఈ ఆట తీరుతో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇటీవల ముంబైలో ఓ పెద్ద ఇల్లు కొన్న జైస్వాల్ తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను గుర్త చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాగానే, ఎలాగైనా ముంబైలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాను. ఎందుకంటే.. మా కుటుంబం ముంబైలో చాలా చోట్ల గడిపింది. మంచి ఇల్లు కొనుక్కొని తల్లిదండ్రులు, తోబుట్టువులతో హాయిగా జీవించాలనుకుంటున్నాను. నేను కళ నెరవేరింది. నా జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి? భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా అని ’ అని యశస్వి తన భావోద్వేగాలను పంచుకున్నాడు. అయితే ఇదంతా ఐపీఎల్ తోనే సాధ్యమైందని, నా కలను నెరవెర్చింది ఐపీఎల్లేనని చెప్పుకొచ్చాడు.