Devineni Avinash : ఎన్నికల మాన్యుఫెస్టోలో చెప్పిన విధంగా 95 శాతం పైగా హామీలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ రోజు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారితోట ,తారకరామా నగర్ కరకట్ట ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.
అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హా మీ పేరుతో ముద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎ స్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంట నే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నాం అని అన్నారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో 35కోట్ల రూపాయలు వెచ్చించి అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది అని అన్నారు.స్వర్గీయ వైయస్సార్ గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని జగన్ గారి బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుంది అని ధీమా వ్యక్తంచేశారు.
కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీన స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్య నారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.