Vijaya Sai Reddy Tweet :
ఏపీ సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు మీద, టీడీపీ మీద ట్విట్టర్ లో సెటైర్లు వేస్తుంటారు. చంద్రబాబు ఏం మాట్లాడినా వాటిని కోట్ చేస్తూ ట్విట్వర్ లో ఎద్దేవా చేస్తుంటారు.
అయితే మరోసారి ఏపీలోని ప్రతిపక్షాలపై ట్విట్టర్ లో మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు ఏపీకి సంబంధించి ఎజెండా లేదు. వారికి కేవలం జెండాలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి లేదు, ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు లేవు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వారు ప్రతికూల ప్రచారం మాత్రమే చేస్తారు. అంతకుమించి మరేమీ చేయలేరు అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. పొరపాటున వీరిని ఎన్నికల్లో గెలిపిస్తే సీఎం కుర్చీ తో కూడా మ్యూజికల్ చైర్స్ ఆడతారని తన దైన శైలిలో ఎద్దేవా చేశారు. సీఎం కుర్చీ కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేనంటే ను మ్యూజికల్ చైర్ ఆడతారు అన్న సంకేతాన్ని విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా ప్రజల్లోకు తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఏపీలో రాజకీయాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆయన ఎక్కడైనా కలుపుకుపోయే రాజకీయాలు కావాలి. ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటూపోతే చివరకు ఎవరూ మిగలరు అంటూ పేర్కొన్నారు. మ్యానిప్యులేషన్లు, కుట్రలు, నోట్ల కట్టలతో ఒక చోటకు చేర్చిన రహస్య స్నేహితులు కూడా చెల్లాచెదరవుతారంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ‘విజనరీ’కి కొత్త ఆలోచనలు రావడం లేదా? అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.
ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోస్తున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధికి తాము ఏం చేస్తామో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. తాము ఏం చేస్తామో కూడా చెప్పుకోలేని దీన స్థితి అంటూ ఎద్దేవా చేశారు. అర్థం లేని ఆవేశాలు, వీరంగాలతో పైసా ప్రయోజనం ఉండని పవన్ కు చురకలంటించారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరించండి అంటూ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష పార్టీల నాయకులకు హితవు పలికారు. తన పోస్టుల ద్వారా రాష్ట్రంలో తాజాగా టీడీపీ, జనసేన ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ReplyForward
|