Split Kapu votes : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. పది రోజులుగా సాగుతున్న యాత్ర మంచి ఊపుతో కొనసాగుతున్నది. అయితే ఈ యాత్ర ద్వారా పవన్ కు మంచి మైలేజీ వస్తున్నది. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. వపన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. సలహాదారు సజ్జల నుంచి పోసాని వరకూ అందరూ స్పందిస్తున్నారు. పవన్ టూర్ పై విమర్శలు పెంచారు. అయితే ఇదంతా చూసి జనసైనికులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ యాత్రను చూసి భయపడే వైసీపీ నేతలంతా ఇలా ఒకరి తర్వాత ఒకరు మాటల దాడి చేస్తున్నారని అనుకుంటున్నారు.
అయితే ముద్రగడతో కలిసి కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తు్న్నది. అయితే పవన్ కల్యాణ్ యాత్ర ఎక్కడ పెట్టినా జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ పవన్ వారాహి యాత్ర ప్రభావం గోదావరి జిల్లాల్లో విపరీతంగా ఉంది. దీంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. వెంటనే ముద్రగడను దింపింది. అయితే ఇది పవన్ కే మంచి చేసింది. జగన్ కు మద్దతుగా ముద్రగడ రంగంలోకి దిగడంతో కాపులంతా మండిపడుతున్నారు.
అయితే ఇప్పటివరకు ముద్రగడ అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఆయన కాపు రిజర్వేషన్ల కోసం గతంలో పోరాడారని కొంత సానుభూతి ఉంది. ముద్రగడతో పాటు పోసాని కృష్ణమురళి కూడా పవన్ పై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. కాపు ఓటు బ్యాంక్ పవన్ వైపు వెళ్తే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే కాపు ఓట్లను చీల్చాలని భావిస్తున్నది. ఏపీలో టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్డి సామాజికవర్గం నుంచి సపోర్ట్ ఉంటుంది. దీంతో కాపు ఓట్లపై వైసీపీ దృష్టి పడింది.
పవన్ కు ఆ ఓట్లు మళ్లితే టీడీపీ కి లాభం చేకూరుతుంది. పవన్ ఇప్పటికే టీడీపీతో పొత్తులకు సిద్ధమవుతున్నారు. మరి వైసీపీ ఇక రంగంలోకి దిగక తప్పని పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ తిడితే ఇంక జనసేనానికి ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే వైసీపీపై అంత మంచి అభిప్రాయం కాపుల్లో లేదు. ఇక వారాహి యాత్ర కు మరింత ఊపు వారే ఇచ్చినట్లు అవుతుంది.