
YCP Patanam Start :
‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సమాజం వైసీపీపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. నేను చంద్రాబాబు నాయుడుతోనే (I Am with CBN)లో భాగంగా యూ బ్లడ్ ఫౌండర్, జేఎస్‌డబ్ల్యూ టీవీ అధినేత డా. జగదీష్ బాబు యలమంచిలి గారు అమెరికా నుంచి అక్కడి తెలుగు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..
‘చంద్రబాబును అరెస్ట్ చేయడం ఘోరమైన చర్య, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ ఈ రోజు చంద్రబాబు నాయుడి వైపున ఉన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆయన డెవలప్ చేశారు. చంద్రబాబును జగన్ ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పనిలేదు. ఈ రోజు ఇటు హైదరాబాద్ గానీ, అటు ఆంధ్రప్రదేశ్ గానీ ఈ రేంజ్ లో ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు అని అందరికీ తెలిసిందే. అది నీకు కూడా తెలుసు జగన్.
పగలు, ప్రతీకారాలు ఉండవచ్చు గాక.. కానీ ఆయన సాటి తెలుగు వాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జనసేన, టీడీపీ తమ్ముళ్లు అందరూ టీడీపీకి మద్దతుగా ఉన్నారు. వీరంతా నిన్ను తరిమే రోజు ఒకటి వస్తుంది. ఎన్టీఆర్ జాతి సొత్తు.. అందునా తెలుగువారి ఆస్తి.. రాజకీయాల్లో ఆయన వారసుడిగా వచ్చిన చంద్రబాబు తెలుగు వారి కీర్తి కిరీటం. ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏ విధంగా వచ్చింది. పిలువు.. మాట్లాడు.. ఇలా చేయడం కరెక్ట్ కాదు.
ఈ రోజు కేంద్రంలో బీజేపీ తొమ్మిదేళ్లు రూల్ చేసిందంటే దానికి కారణం కూడా చంద్రబాబే. ఆయనది మీ తండ్రి అంతటి వయస్సు తండ్రిలా గౌరవించాలి కానీ ఇలా జైలులో పెట్టడం ఏంటి. ఇక్కడి నుంచే నీ ప్రభుత్వ పతనం మొదలవుతుంది. ప్రపంచ తెలుగు వారి తరుఫున చంద్రబాబు ఇది చెప్తున్నాం. చంద్రబాబు నాయుడిని గౌరవించాలి’ అని డా. జగదీష్ బాబు యలమంచిలి మీడియా ముఖంగా వైసీపీని హెచ్చరించారు.