Singer Mangli : మన సోషల్ మీడియా వాళ్ళ దగ్గర వున్నంత ఇన్ఫర్మేషన్ టీడీపీ నాయకులు దగ్గర వుండదేమో అన్పించకమానదు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ కు ప్రతి ఒకళ్ళ చరిత్ర తెలుసు.. కానీ నాయకుల దగ్గర అంత ఇన్ఫర్మేషన్ వుండదు.

(పై ఫొటోలో ఉన్నావిడ సింగర్ మంగ్లీ.) వైసిపిలొ తెగ హడావుడి చేసింది. ఒకరకంగా ఆపార్టీకి అస్థాన సింగర్ అని చెప్పొచ్చు. అలాంటి ఆమె ఇప్పుడు మన కేంద్రమంత్రి పక్కన ఫోటోలకు ఫోజులిస్తూ కన్పించింది. దీనిపై పలువురు టీడీపీ హర్డ్ కోర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రామ్ మోహన్ నాయుడుకి ఆమె సంగతి తెలియక దగ్గరకు రానిచ్చి ఉంటారని పలువురు భావిస్తున్నారు. దీంతో వారంతా కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వదిలేస్తే బెటరేమోనని అనుకుంటున్నారు. ఇకనైన రాంమోహన్ నాయుడు కూడా ఫ్యూచర్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.