
ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా #YSRCPAgain2024 పేరిట హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది..
#YSRCPAgain2024 హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్లింది జాతీయస్థాయిలో ఇప్పుడు ఇది నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నది నాలుగేళ్లలో వైసీపీ సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయంగా సాధించిన విజయాలు, పథకాలు, ఇతర అంశాలను వైసీపీ అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియా ఇన్చార్జిలు పోస్ట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రస్తుతం చర్చినీయాంశమయ్యాయి.
అయితే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే జాతీయస్థాయిలో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవడం వైసీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాను వైసీపీ బలంగా ఉపయోగించుకుంటున్నదనే టాక్ కు ఇది మరింత ఊతమిచ్చింది గతంలో జగన్ పాదయాత్ర సమయంలోనూ సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం కూడా ‘వై నాట్ 175’ పేరిట వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు తమను అధికారంలోకి తీసుకొస్తాయని భావిస్తున్నారు.