
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపిన విషయం అందరికి తెలిసిందే. రజనీ కాంత్ శతజయంతి వేడుకలకు విచ్చేసి చంద్రబాబును పొడిగారు. అంతే గంగిరెద్దుకు తాడు తెంపినట్లు విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు…
రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు రాలేదు. అధికార పార్టీ విధానాలపై కానీ .. ఏపీలో ఉన్న రాజకీయాలపై కానీ స్పందించారు. తన మిత్రుడ్ని పొగిడారు. దానికే వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు.కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం రజనీకాంత్‌ను అన్నీ మాటలన్నారు. చివరికి రజనీ ఆరోగ్యపరమైన అంశాలను కూడా ఎగతాళి చేశారు. వ్యక్తిగతంగా తిట్టి పోశారు. రజనీకాంత్ సూపర్ స్టార్. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు. ఆయన చంద్రబాబును పొగడటమే తప్పన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడిన వైనం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తప్పనిసరగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనన్న డిమాండ్ సోషల్ మీడియాలో ఉద్దృతంగా సాగుతోంది. ఒక్క తమిళ్ నుంచే కాదు..తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వినిపిస్తోంది. ఇదేం సైకో రాజకీయమన్న ప్రశ్న ప్రతీ చోటా వస్తోంది. అందుకే జగన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. తమ ప్రత్యర్థుల్ని పొడిగినా తట్టుకోలేనంత సైకోయిజానికి దిగజారిపోయిన వైసీపీ సహజంగా రాజకీయాల్లో కనిపించని ఓ కట్టు బాటు ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా తమను విమర్శిస్తేనే తిరిగి విమర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధంలేనివారు. సెలబ్రిటీలు అయినా మరొకరు అయినా తమకు ఉన్న వ్యక్తిగత అనుబంధాల రీత్యా.. తమ ప్రత్యర్థుల్ని పొగిడితే ఇతర పార్టీలు పట్టించుకోవరు. తమను విమర్శిస్తే మాత్రం ఎదురుదాడి చేస్తాయి కానీ ఏపీలో ఇక్కడ పూర్తి విరుద్ధం..
జగన్ మానసిక వికృతాన్ని సంతృప్తి పరిచి పదవులు.. ప్రయోజనాలు పొందడంలో వైసీపీ శ్రేణులు రాటుదేలి పోయారు. జగన్ మెప్పు కోసం వారి ముందు రజనీకాంతా..మోదీనా అన్నది వీరు చూసుకోరు.అధిష్టానం నుంచి అదేశాలు వస్తే చాలు విరుచుకుపడడమే.. తిట్టే వాళ్లది ఏముంది. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకీ వంత పాడుతారు. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ టీడీపీ వైపు వెళ్తారు. ఇక్కడ అసలు నష్టం జరిగేది జగన్ కే.






