Year Ending Films : ప్రపంచ కప్ క్రికెట్ సీజన్ ముగిసింది. మూవీ రిలీజ్ కు ఇప్పుడు మంచి అవకాశం. క్రిస్మస్ కు కౌంట్ డౌన్ మొదలై 2023 ముగింపు కావడంతో వచ్చే 40 రోజుల్లో ఎలాంటి రిలీజ్ లు వస్తాయా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నవంబర్ 24 నుంచి ఈ ఏడాది ముగిసే వరకు రిలీజ్ అయ్యే సినమాలు ఇవే..
‘ఆదికేశవ’ -రిలీజ్ డేట్ నవంబర్ 24
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ చిత్రం ఇది. అపర్ణ దాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై వైష్ణవ్ రుద్ర పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
‘కోటబొమ్మాళి పీఎస్’-రిలీజ్ డేట్ నవంబర్ 24
మలయాళ హిట్ ‘నాయట్టు’కు కోటబొమ్మాళి పీఎస్ రీమేక్. ఈ చిత్రంలో శివానీ, శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు.
‘యానిమల్’ -రిలీజ్ డేట్ డిసెంబర్ 1
సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం యానిమల్. విలక్షణమైన కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రన్ టైమ్ 3.20 గంటలు ఉంటుందని ప్రచారం జరుగుతున్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతోంది.
‘హాయ్ నాన్నా’ -రిలీజ్ డేట్ డిసెంబర్ 7
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్నా’. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.
‘డంకీ’ -రిలీజ్ డేట్ డిసెంబర్ 22
రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల విజయం తర్వాత హ్యాట్రిక్ సూపర్ హిట్లు కొట్టాలని షారుఖ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. డిసెంబర్ 22న ‘సలార్’కు పోటీగా ఈ చిత్రం విడుదల కానుంది.
‘సలార్’ రిలీజ్ డేట్ డిసెంబర్ 22
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ గా విడుదల కానుంది.
వీటితో పాటు, డిసెంబర్ లో చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 3న వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, విశ్వకేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, నితిన్ ‘ఎక్సార్డినరీ మ్యాన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.