
Yoga : శ్రీనగర్లో జి20 సమ్మిట్ జరుగుతున్నది. అత్యంత కట్టు దిట్టమైన భద్రత నడుమ ఈ సదస్సు కొనసాగుతున్నది. అయితే ఈ సదస్సుకు 20 దేశాలకు చెందిన 64 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే శ్రీనగర్ వివాదాస్పద ప్రాంత మంటూ చైనా ఈ సదస్సుకు హాజరు కాలేదు. కాగా ఈ సమావేశానికి తెలుగు హీరో రామ్ చరణ్ హాజరై ఆకట్టుకున్నారు. 370 జీవో రద్దు తర్వాత శ్రీనగర్లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం ఇదే. కాగా బుధవారంతో ఈ సదస్సు ముగియనుంది.
అయితే ఇండియా అంటేనే యోగాకు ప్రసిద్ధి. ఈ సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులు శ్రీనగర్లో యోగా క్లాసులకు హాజరయ్యారు. వీరికి యోగా నేర్పించేందుకు ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేశారు. ఉదయం వేళ వ్యాయామంతో పాటు యోగ చేశారు. ఆరోగ్యం యోగ మంచిదని వారికి తెలియజేశారు. వారితో ప్రాణాయామం కూడా చేయించారు. పలు ఆటలకు కూడా ఏర్పాటు చేశారు.
అయితే విదేశీ ప్రముఖుల రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. ఎన్ ఎస్ జీ, మెరైన్ కమాండో లు గస్తీ తిరుగుతూ భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దుకాణాలకు ప్రత్యేక పాసులు అందజేశారు. పలు రహదారులు మూసివేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఆశా భవన్ వ్యక్తం చేశారు.