
YS Jagan : ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇలా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఇండ్ల పట్టాల పంపిణీ దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. కొంతమంది మారీచులు, రాక్షసులు పంపిణీ ని అడ్డుకున్నారన్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం పేదలకు కొండంత అండగా నిలిచిందని తెలిపారు. అమరావతి సామాజిక అమరావతిగా మారిపోతుందని చెప్పుకొచ్చారు. జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇక పట్టాలు పంపిణీ చేస్తామన్న జగన్. రూపాయి. ఏడు లక్షల నుంచి పది లక్షల విలువచేసే ఇంటి స్థలాన్ని పేదలకు అందజేస్తున్నట్లు తెలిపారు. 50709 మంది లబ్ధిదారులకు ఈ ఇండ్ల పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 1,80,000 అకౌంట్లో వేస్తామని ప్రకటించారు.
అయితే పేదలకు పట్టాల పంపిణీ పై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నరకాసురుని నమ్మొచ్చు గాని చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు చేయాల్సిన కుట్రలను చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ మరికొందరు మీడియా సంస్థల అధినేతలు కలిసి తనపై కుట్ర చేస్తున్నారని, ప్రజలే వాటిని ఎదుర్కోవాలని కోరారు. రానున్న రోజుల్లో మీరు కుట్రలు మరింతగా పెరుగుతాయని అభివృద్ధిని అడ్డుకోవడమే వీరి లక్ష్యమని పేర్కొన్నారు. అయినా ఇండ్ల పట్టాల పంపిణీ ఆపబోమని, పేదలకు న్యాయం చేసేదాకా విశ్రమించబోమని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని చెప్పారు.