32.3 C
India
Wednesday, April 17, 2024
More

    Watch Ponniyan Selvan 2 : ఉచితంగానే ‘పొన్నియన్ సెల్వన్ 2’ చూడవచ్చు.. ఎలా అంటే?

    Date:

    watch Ponniyan Selvan 2
    watch Ponniyan Selvan 2

    watch Ponniyan Selvan 2 : పొన్నియన్ సెల్వన్.. ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.. ఈయన ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు గత ఏడాది పార్ట్ 1 ను రిలీజ్ చేసాడు.. భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వహ్చింది.

    ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. దాదాపు 600 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి కోలీవుడ్ లోనే సంచలన విజయం నమోదు చేసింది. పార్ట్ 1 విజయంతో పార్ట్ 2 కూడా గ్రాండ్ గా తెరకెక్కించి ఈ ఏడాది ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసాడు.. పార్ట్ 2 కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

    అయితే పార్ట్ 1 మించి కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను లేక ప్రొడక్షన్స్ వారు నిర్మించారు.. అలాగే త్రిష, జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించగా దాదాపు 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యింది.

    అయితే పొన్నియన్ సెల్వన్ 2 ముందుగా ఓటిటిలో డబ్బులు చెల్లించి చూసేలా ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్ణయించి స్ట్రీమింగ్ కు ఇచ్చింది. ఇక అది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగానే వీక్షించవచ్చు అని ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

    Share post:

    More like this
    Related

    Kadiyam Srihari : కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి

    Kadiyam Srihari : తాను కమీషన్లు తీసుకున్నట్లు ఎవరూ నిరూపించినా తన...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Siri Hanumanthu : సిరి హనుమంతు సొగసులు

    Siri Hanuman : యాంకర్ సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan- Mani Ratnam : కమల్ హాసన్- మణిరత్నం సినిమాకు బిగ్ బజ్..

    Kamal Haasan- Mani Ratnam : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో...

    భారీ వసూళ్ల దిశగా పీఎస్-2 అన్ని వందల కోట్ల వసూళ్లు..

    భారీ చిత్రాల రిలీజ్ లో భాగంగా విడుదలైన సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్-2’....

    మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య.. వీడియో వైరల్

    mani rathnamదర్శకుడు మణిరత్నం ఫెవరేట్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ కాగా.. ఐశ్వర్యా...

    మూవీ మేకింగ్ స్టయిల్ మార్చిన రహెమాన్.. మణిరత్నం కామెంట్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఖుష్..

    అద్భుతమైన చిత్రాల దర్శకుడు మణిరత్నం.. అంతే అద్భుతమైన సంగీత దర్శకుడు ఏఆర్...