
Valentine Day : ఓ యువతి, యష్ అనే యువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో బ్రేక్ చెప్పుకుని విడిపోయారు. ఈ నేపథ్యంలో అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది. ఈక్రమంలో ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ ప్రియుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. వాలంటైన్ డే స్పెషల్‌గా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 100 పిజ్జాలు ఆర్డర్ చేసింది.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పిజ్జాలకు ఆ యువతి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. డెలివరీ బాయ్ పిజ్జాలు తీసుకుని వచ్చి ఇంటి ముందు పెట్టి యష్‌ను డబ్బులు పే చేయమని అడగటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే తాను ఆర్డర్ చేయలేదని, బిల్లు కట్టే ప్రసక్తే లేదని గొడవపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి – వాలెంటైన్ సర్‌ప్రైజ్ Turns into Trouble!
వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
అతడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే, ఆ పిజ్జాలు క్యాష్ ఆన్ డెలివరీ… pic.twitter.com/azjqzlZkq0
— Aadhan Telugu (@AadhanTelugu) February 14, 2025






