Marriages : మోర్గాన్ స్టాన్ టి అనే సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వారు నిర్వహించిన సర్వేలో తేలింది. 2030 సంవత్సరాల నాటికి 40 శాతం మహిళలు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి కారణం స్వతంత్రత పెరగడం, ఉద్యోగాలు చేయడం అని అర్థమవుతుంది. ఒకప్పుడు కుటుంబంలో అమ్మాయిలు ఉంటే పెళ్లెప్పుడు చేస్తారని ఎక్కువగా ప్రశ్నించేవారు. ప్రస్తుతం సమానత్వ భావాలు ఎక్కువగా పెంపొందడం వల్ల మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో ఇంటిపట్టునే ఉండేవారు తద్వారా ఎక్కువగా పెళ్లి అనే పదాన్ని చుట్టుపక్కల వారు బంధువులు వినిపించేవారు.
ప్రస్తుతం బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అవుతున్నారు. దీంతో ఆర్థిక సమానత్వం, ఆర్థిక స్వేచ్ఛ, స్వతంత్రం ఎక్కువగా పెరిగిపోయాయి. దీంతో మహిళలు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపించడం లేదు. గతంలో వంటింటి కుందేలుగా జీవిస్తుండేవారు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు. భర్త ఎలా చెబితే అలా వినాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఇలాంటివి ఏమీ లేదు. ఉద్యోగం చేస్తూ స్వేచ్ఛగా జీవిస్తూ ఉండడం వల్ల వారికి పెళ్లి పైన ఆసక్తి పోయింది.
దీంతో రాబోయే తరం లో పిల్లలు పుట్టే సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఈ సంస్థ అధ్యయనం లో తేలింది. ఒకప్పటి మహిళల్లో ఉండే భావజాలాలు ప్రస్తుతం మహిళల్లో పూర్తిగా మారిపోయాయని తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండేందుకే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు స్టాంటి అధ్యయనములో వెల్లడైంది. ఇలా జరగడం భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు పెళ్లితో తమ వైవాహిక బంధాన్ని దృఢంగా చేసుకొని పిల్లల్ని కనీ కుటుంబం లో అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవారు. కానీ ఇప్పుడు వచ్చిన ఆర్థిక స్వేచ్ఛ వల్ల ఉద్యోగాలు చేయడం సమానత్వం వల్ల పెళ్లి అనే పదాన్ని మహిళలు ఇష్టపడడం లేదని ఈ సంస్థ చేసిన సర్వే ద్వారా తెలుస్తోంది.