26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Pawan Kalyan : మరో పది నెలలే మీ టైమ్… వైసీపీ ప్రభుత్వాన్ని కిందికి దించుతాం వారాహి యాత్రలో పవన్ కల్యాన్ వ్యాఖ్యలు జనసైనికుల్లో హుషారు

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan
    Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు ఊహించని స్పందన వస్తున్నది. విరామం లేకుండా తన యాత్రన కొనసాగిస్తున్నారు.
    అయితే పవన్ కల్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా అభిమానులు వేలాదిగా తరలివస్తుంటారు. అలాంటిది పార్టీ ప్రచార యాత్ర అంటే ఇక ఏ రేంజ్ లో ఫ్యాన్స్ తాకిడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వైపీపీ పార్టీకి మరో పది నెలల టైమ్ మాత్రమే ఉందని, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో జగన్ అవినీతి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి  రానివ్వబోమని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు జనసైనికుల్లో హుషారు నింపుతున్నాయి.   పవన్ తన యాత్రలో భాగంగా ఉదయం పూట అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.  ప్రతి నియోజకవర్గానికి రెండు రోజులు కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  వీలైనంత  ఎక్కువ మందిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శల్లో పవన్ తనదైన మార్క్ చూపిస్తూనే  దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన ఒక్కడిని ఓడించేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నదో కూడా చెప్పుకొస్తున్నాడు. కేవలం తన ఒక్కడిని అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారంటూ అధికార పార్టీని  టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న దురాగతాలపై తనదైనశైలిలో విరుచుకు పడుతున్నారు. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇప్పటికైతే ఇంకా నిర్ణయానికి రాలేదని తెలుస్తున్నది.  తన యాత్రను వస్తున్న స్పందన చేసి అధికార పార్టీ గుండాలు తనను చంపేందుకు సుపారీ ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ క్రూరంగా ఆలోచిస్తున్నదని విమర్శిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్రజల నుంచి మంచి వస్తున్నమ స్పందన వైఎస్సార్సీపీ నేతలను భయాందోళనలకు గురిచేస్తోందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటునన్నారు. రోడ్‌షోపై కు విపరీతంగా జనాలు వస్తున్నారని చెబుతున్నారు.  రాష్ర్టంలో గంజాయి అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, ఇది భవిష్యత్ కు మంచిది కాదని పవన్ కల్యాన్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.విశాఖలో నేరాలు, భూకబ్జాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మరో 10 నెలల గడువు మాత్రమే ఉందని, ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan kalyan Varahi Yatra : 21 నుంచి పవన్ మరో సారి ‘వారాహి యాత్ర’ ఎక్కడి వరకో తెలుసా?

    Pawan kalyan Varahi Yatra : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకే...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విడాకుల పిటిషన్ లో సంచలన విషయాలు!

    Pawan Kalyan :  జనసేనాని పవన్ కళ్యాణ్ విడాకుల విషయంలో పలు సంచలన...

    Pawan Kalyan : గాజువాక నుంచి బరిలో పవన్ ?

    Pawan Kalyan : జనసేన అధినేతపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫోకస్ పెడుతున్నట్లు...

    Pawan Kalyan : నీరసంగా పవన్.. ‘వారాహి’కి బ్రేక్..!

    Pawan Kalyan : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన చీఫ్ పవన్...