YS Sharmila Fight : వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల తన భవిష్యత్ అంతా తెలంగాణలోనే ఊదరగొట్టిన విషయం తెలసిందే. పార్టీ పెట్టి అధికార పక్షంపై విరుచుకుపడింది. ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టింది. పాదయాత్ర కూడా చేసింది. అధికార పక్షం అడ్డకోవడంతో అర్ధంతరంగా పాదయాత్రనుముగించాల్సి వచ్చింది. అదే తరుణంలో కర్ణాకటక లో ఎన్నికలు రావడం, కాంగ్రెస్ గెలవడంతో షర్మిల తన రూట్ మార్చుకుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగా పోరాడుతున్నదే తప్ప పెద్ద స్థాయి నాయకులెవరూ ఆమె పార్టీలో చేరలేదు. కార్యకర్తలు మాత్రమే రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఆ పార్టీలో చేరారు. పార్టీ నిర్వహణ కూడా కష్టం కావడంతో కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. చర్చలు జరిపారు. అయితే పొత్తా, విలీనమా అనేది మాత్రం తేలలేదు.
Breaking News
పొలిటికల్ డైలమాలో
షర్మిల పొలిటికల్ డైలామాలో పడింది. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంతో పాటుగా రాజకీయ భవిష్యత్ నూ అదే పార్టీలో కొనసాగించాలని షర్మిల భావించారు. కానీ, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో షర్మిల భవిష్యత్ మరింత ఆందోళన కరంగా మారింది. అటు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు జరుగుతున్నది.
ఆశలు గల్లంతేనా.?
తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. వైఎస్ షర్మిల ఆశలు ఫలించే ఫలించేలా లేవు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానున్నది. ఇప్పటికే కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసి వడపోత దశలో ఉన్నది. నియోజకవర్గాల వారీగా ముగ్గురిని ఎంపిక చేసి అందులో ఒకరిని ఫైనల్ చేసి, మరొకరిని స్టాండ్ బై లో ఉంచాలని భావిస్తున్నది. అయితే షర్మలి పార్టీ పెట్టిన కొత్తలోనే ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించింది. పాలేరు వేదికగానే కార్యక్రమాలు చేపట్టారు. ఇదే సమయంలో తన పార్టీ అనుకున్న స్థాయిలో ఎదగకపోవటంతో కాంగ్రెస్ తో విలీనం చేసేందుకు ముందుకు సాగారు. నేరుగా సోనియా, రాహుల్ తో ఢిల్లీలో సమావేశాలు కూడా జరిపారు.
సముచిత గౌరవం కానీ..
వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు సోనియా, రాహుల్ గౌరవం ఇచ్చారు. నాడు వైఎస్సార్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చోటు చేసుకున్న పరిణామాలపైన స్పష్టత ఇచ్చారు. వారు చెప్పిన అంశాలతో వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జ్ షీట్లలో చేర్చటంలో వారి ప్రమేయం లేదని షర్మిల నిర్దారణకు వచ్చారు. పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని షర్మిలకు హామీ దక్కింది. అయితే, షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని కాంగ్రెస్ పెద్దలకు స్పష్టం చేసారు. దీంతో అసలు సమస్య మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా మరి కొందరు తెలంగాణలో షర్మిల ఎంట్రీని వ్యతిరేకించారు. దీంతో ఆమెకు ఏపీలో అవకాశం కల్పిస్తామని ప్రతిపాదించారు. కానీ, షర్మిల అంగీకరించ లేదు.
పాలేరు పోయినట్లేనా?
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై షర్మిలదే తుది నిర్ణయం. చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేసీ వేణుగోపాల్ సైతం ఆమెకు ఇదే స్పష్టం చేసారు. ఇదే సమయంలో తాజాగా షర్మిల ఆశించిన పాలేరు(Palair) సీటును మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి(Ponguleti) ఖరారు చేసినట్లు తెలుస్తుననది. అదే విధంగా ఖమ్మం సీటును మాజీ మంత్రి తుమ్మలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐ కి కేటాయింనున్నారు. దీంతో, షర్మిలకు లోక్ సభ సీటు ఇస్తున్నారనే చర్చ సాగినా..దాని పైనా స్పష్టత లేదు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో షర్మిల భవిష్యత్ అడుగులు ఏంటి.. ఏం చేయబోతున్నారు.. కాంగ్రెస్ తోనే రాజకీయంగా ముందుకు వెళ్తారా..నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే ఆసక్తి కొనసాగుతోంది.