26.9 C
India
Friday, January 23, 2026
More

    Gautam Gambhir : యువరాజ్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి : గౌతం గంభీర్

    Date:

    Gautam Gambhir
    Gautam Gambhir and Yuvi

    Gautam Gambhir : గౌతమ్ గంభీర్ ఇండియా క్రికెట్ టీంకు కొత్త కోచ్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గౌతం గంభీర్ ఒకానొక ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన వ్యక్తి యువరాజ్ సింగ్ అని ప్రశంసించాడు.  2007 టీ 20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లో మ్యాన్ ఆప్ ది సిరీస్ లు గెలుచుకున్న యువరాజ్ సింగ్  కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

    ఒక వ్యక్తి క్యాన్సర్ తో పోరాడుతూ కూడా అద్భుతంగా రాణించి టీం ఇండియాకు ప్రపంచ కప్ అందించాడంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నాడు. కానీ యువరాజ్ కు మాత్రం సరైనంత గౌరవం మాత్రం అందడం లేదు. ఎందుకంటే యువరాజ్ కంటే తక్కువ చేసిన వారికి కూడా అంతకంటే ఎక్కువ క్రెడిబిలిటీ సొంతం చేసుకుంటున్నారు.

    యువరాజ్ ఒక స్టార్ బ్యాట్స్ మెనే కాకుండా స్టార్ బౌలర్ కూడా. మంచి ఆల్ రౌండర్. ఇంతవరకు అలాంటి ఆల్ రౌండర్ ఇండియాకు దొరకడం అరుదు. అయితే ఇండియాకు ఆడిన ప్రతిసారి యువరాజ్ ప్రాణం పెట్టేవాడు. ఆటలో అంతగా లీనమై పోయేవాడని గంభీర్ అన్నాడు.
    ప్రాణాంతక వ్యాధితో మైదానంలో యువరాజ్ పోరాడుతూ.. రక్తం కక్కుతూ కూడా వెస్టిండీస్ పై సెంచరీ చేశాడు. ఇంత చేసిన వ్యక్తికి భారత రత్న ఇవ్వడం సబబు అనిపిస్తోందంటూ యువరాజ్ సింగ్ ను గౌతం గంభీర్  ఆకాశానికెత్తేశాడు.

    ఇండియా క్రికెట్ కు యువరాజ్ లాంటి ఆల్ రౌండర్ మరొకరు దొరకరని అన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో ప్రతి ప్లేయర్ ను హిరోలుగా పరిగణిస్తున్నాం. కానీ యువరాజ్ సింగ్ లాంటి రియల్ హిరోలను మాత్రం పట్టించుకోవడం మానేశామంటూ చెప్పాడు. అదే సమయంలో 1983 వరల్డ్ కప్ ఫైనల్ హిరో ఎవరో తెలుసా అంటూ యువతరాన్ని ప్రశ్నించాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gautam Gambhir : గంభీర్ కు ఇదే చివరి అవకాశమా? అదే జరిగితే వేటు తప్పదా..?

    Gautam Gambhir : ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్...

    Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

    Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

    Gautam Gambhir : కోచ్ పదవీ అందుకే ఆలస్యమా.. గౌతం గంభీర్ పక్కానేనా .. 

    Gautam Gambhir : టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్...