Venus : మనకు శుక్రగ్రహ సంచారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. శుక్రుడి సంచారం సరిగా లేకపోతే మనకు నష్టాలే ఉంటాయి. అందుకే శుక్రుడు మన జాతకంలో బలంగా ఉంటేనే మనకు అన్ని పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో శుక్ర గ్రహానికి ప్రాధాన్యం ఉంటుంది. దీంతో ఐశ్వర్యం కలుగుతుంది. ఈ గ్రహ సంచారం కారణంగా అన్ని రాశుల జీవితాల్లో మార్పులు రావడం సహజం. కొన్ని రాశులకు మాత్రం మంచి ప్రభావం ఏర్పడుతుంది.
మేష రాశి వారికి శుక్ర గ్రహం కారణంగా ఆనందం వెల్లివిరుస్తుంది. దీంతో శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి. వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. శుక్ర గ్రహ సంచారంతో కర్కాటక రాశి మంచి లాభాలు కలగనున్నాయి. భవిష్యత్ లో మంచి ప్రయోజనాలు సాధిస్తారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి వారికి కూడా మంచి కాలం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కెరీర్ బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దీంతో అన్నింటా విజయాలే దక్కుతాయి. వ్రశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. శుభ వార్తలు అందుకుంటారు. శుక్ర గ్రహ సంచారంతో కోరికలు నెరవేరతాయి.
మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఐదో స్థానంలో శుక్ర గ్రహ సంచారంతో ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. భవిష్యత్ లో ప్రయోజనాలు దక్కించుకుంటారు. శుక్ర గ్రహ సంచారంతో అన్నింటా విజయమే కలుగుతుంది.