
Zucchini : ఈ రోజుల్లో కళ్ల జబ్బులు వేధిస్తున్నాయి. వయసులో సంబంధం లేకుండా అందరు బాధపడుతున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో కంటి జబ్బులను నయం చేసే వాటిలో జుకిని వెజిటబుల్ మనకు ఎంతో మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యంలో కీలకంగా వ్యవహరిస్తుంది. జుకిని వెజిటబుల్ చూడటానికి కీరా దోస వలె ఉంటుంది. కానీ దోస కాదు. కంటి సమస్యలను తీర్చడంలో కీలక పాత్ర వహిస్తుంది.
ప్రస్తుతం టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు తదేకంగా చూస్తున్నారు. దీంతోనే కళ్లకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. కంటిలోని రెటీనా దెబ్బతినకుండా చేస్తుంది. జుకిని వెజిటబుల్ ని సలాడ్ గా చేసుకుని తినొచ్చు. జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. ఇందులో మిరియాల పొడి కలుపుని తీసుకోవచ్చు.
డయాబెటిస్ కారణంగా కళ్ల జబ్బులు వస్తున్నాయి. కంటి సమస్యలను జుకిని వెజిటబుల్ తగ్గిస్తుంది. ఇందులో మాంగనీసు, లుటీన్, జియాక్రంతిన్, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. కంటిని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
దీంతో జుకిని వెజిటబుల్ తో కంటి సమస్యలు లేకుండా పోతాయి. దీని వల్ల జుకిని వెజిటబుల్ ను తీసుకోవడం ఉత్తమం. కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే జుకినిని తినడం చాలా మంచిది. దీనికి కంటి సమస్యలు లేకుండా చేసుకోవాలంటే జుకిని ని తినడం తప్పనిసరి.