తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి మాల ధరించి దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. దాంతో 8 మంది అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సంఘటన వివరాలలోకి వెళితే ………… తమిళనాడులోని తేని జిల్లా షణ్ముగ సుందర పురం కు చెందిన 10 మంది అయ్యప్ప స్వామి భక్తులు కారులో బయలుదేరారు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి చేరుకుంటున్న సమయంలో తేని దగ్గర ఘాట్ రోడ్డు లో అదుపుతప్పిన కారు లోయలో పడింది. దాంతో 8 మంది చనిపోయారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ యాక్సిడెంట్ కు కారణమని పోలీసులు తెలిపారు.