చైనా భారత్ స్టూడెంట్స్ కు శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్లకు పైగా భారత్ స్టూడెంట్స్ కి చైనాలో ఎంట్రీ లేకుండాపోయింది. అయితే ఇటీవల కాలంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండేళ్లుగా ఇండియన్ స్టూడెంట్స్ కు వీసా ఇవ్వడానికి నిరాకరించిన చైనా ఎట్టకేలకు వీసాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ కు చెందిన దాదాపు 23 వేల మంది స్టూడెంట్స్ చైనాలో వైద్య విద్యని అభ్యసిస్తున్నారు. వాళ్లకు త్వరలోనే వీసాలు మంజూరు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. దాంతో భారత్ కు చెందిన స్టూడెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Breaking News