ఈరోజుల్లో ప్రతీది యూట్యూబ్ లో చూడటం ప్రయోగాలు చేయడం సర్వసాధారణమైపోయింది. అలాగే సోషల్ మీడియా ఉంది మానవ సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం కోసమైతే …… అదే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని దారుణాలు కూడా చేస్తున్నారు. యూట్యూబ్ లో డెలివరీ ఎలా చేయాలో తెలుసుకొని ….. యూట్యూబ్ చూస్తూ తనకు తానే డెలివరీ చేసుకుంది ఓ 15 సంవత్సరాల బాలిక.
అయితే తనకు పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేసి అడ్డంగా బుక్కయ్యింది. ఈ సంచలన సంఘటన ఎక్కడో జరగడం కాదు మన దేశంలోనే జరిగింది. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఈ సంచలన సంఘటన జరిగింది. 15 సంవత్సరాల అమ్మాయికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో ఇద్దరూ ఏకమయ్యారు. కట్ చేస్తే సదరు బాలిక గర్భం దాల్చింది.
అయితే తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఇంట్లో వాళ్లకు తెలియకుండా మేనేజ్ చేసింది ఆ బాలిక. నెలల నిండుకోవడంతో కడుపు మరీ పెద్దగా ఉంది ? అంటూ తల్లి ప్రశ్నించడంతో నాకు కాస్త అనారోగ్యంగా ఉంది అందుకే కడుపు ఎత్తుగా ఉంది అని మాయమాటలు చెప్పింది. కట్ చేస్తే తల్లి ఇంట్లో లేని సమయంలో యూట్యూబ్ చూస్తూ తనకు తానే డెలివరీ చేసుకుంది. తాను పెళ్లి కాకుండానే తల్లి అయ్యానన్న విషయం తెలుసుకొని తన బిడ్డను చంపేసింది.
బయటకు వెళ్లి వచ్చిన తల్లి తన కూతురు పరిస్థితి చూసి షాక్ అయ్యింది. ఏం జరిగింది అని నిలదీయగా మొత్తం విషయాన్ని చెప్పడంతో లబోదిబో మంటూ ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.