
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడి కారుకు ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో మోడీ మనవడికి గాయాలయ్యాయి. మోడీ సోదరుడుకి అలాగే ఆయన కుటుంబానికి స్వల్ప గాయాలయ్యాయి. బెంజ్ కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. సంఘటన వివరాలలోకి వెళితే …….. ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ తన కుటుంబంతో కలిసి బందిపూరాకు కారులో ప్రయాణిస్తుండగా కర్ణాటక లోని మైసూర్ సమీపంలో డివైడర్ ను ఢీకొట్టింది.
ప్రహ్లాద్ మోడీ , ఆయన భార్య , కోడలు , కొడుకు , మనవడితో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ఉన్న అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇక మనవడికి కాస్త పెద్ద గాయమే అయ్యింది. దాంతో ఆసుపత్రికి వెళ్లారు. కారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరో తెలియని పరిస్థితి. అయితే ప్రధాని సోదరుడి కుటుంబం అని తెలియడంతో వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.