షాకింగ్ సంఘటన జరిగింది. ఆగ్రా మున్సిపాలిటీ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ……. 1.94 కోట్ల నీటిపన్ను 1.47 లక్షల ఇంటి పన్ను కట్టాలని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ కు నోటీసులు పంపించడమే ! ఆగ్రా మున్సిపాలిటీ తన పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అలాగే ప్రజలకు బకాయి ఉన్న పన్నులను 15 రోజుల్లో కట్టాల్సిందే అంటూ నోటీసులు ఇచ్చారు.
ఆ నోటీసులలో భాగంగా తాజ్ మహల్ కు కూడా నోటీసులు పంపించారు. అయితే తాజ్ మహల్ చారిత్రాత్మక కట్టడం అని 1920 లోనే బ్రిటిష్ పాలకులు ఆదేశాలు జారీ చేసారు. రక్షిత స్మారక కట్టడం కాబట్టి ఎలాంటి పన్నులను వసూల్ చేయడం లేదు. అయితే పన్నులు అందరి దగ్గర వసూల్ చేయాలనే ఆలోచనతో ఇలాంటి నోటీసులు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.