విదేశాల నుండి పెద్ద ఎత్తున బంగారం తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు పలువురు. కస్టమ్స్ అధికారులు అలాంటి వాళ్ళను పట్టుకొని కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ బంగారం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు సరికదా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా కేరళలో ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈసారి పట్టుబడింది ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ కావడం విశేషం.
సంఘటన వివరాలలోకి వెళితే …… బహ్రెయిన్ – కోజీ కోడ్ కోచీ సర్వీసులో కేరళలోని వయనాడ్ కు చెందిన షఫీ పని చేస్తున్నాడు. ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ లో పని చేస్తున్న సిబ్బంది కాబట్టి ఈజీగా దొంగ బంగారం తరలించవచ్చు అని భావించి షర్ట్ కింద చేతులకు బంగారం చుట్టూ చుట్టుకొని పై నుండి షర్ట్ వేసుకొని వచ్చాడు. ఇక ఎయిర్ పోర్ట్ సిబ్బంది కావడంతో వాళ్లకు వెళ్ళడానికి గ్రీన్ ఛానల్ ( ఎలాంటి చెకింగ్ లేకుండా ఉండే దారి ) గుండా వెళ్ళడానికి ప్రయత్నించాడు.
అయితే షఫీ పై మొదటి నుండి అనుమానం ఉన్న కస్టమ్స్ అధికారులు షఫీని పట్టేసుకున్నారు. అతడిని చెక్ చేయగా రెండు చేతుల లోపల పెట్టుకున్న బంగారం బయటపడింది. 1487 గ్రాముల బంగారం అని తేలడంతో అతడ్ని అరెస్ట్ చేసారు కస్టమ్స్ అధికారులు. ప్రస్తుతం అతడ్ని ప్రశ్నిస్తున్నారు అధికారులు.