పంజాబ్ లోని అమృత్ సర్ రణరంగంగా మారింది. వందలాది మంది నిరసనకారులు తల్వార్ లతో పోలీస్ స్టేషన్ పైకి విరుచుకుపడ్డారు దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంచలన సంఘటన ఈరోజు అమృత్ సర్ లో జరిగింది. సంఘటన వివరాలలోకి వెళితే …… ” వారిస్ పంజాబ్ దే ” గ్రూప్ అధినేత అమృత్ పాల్ సింగ్ దగ్గర లవ్ ప్రీత్ సింగ్ ముఖ్య అనుచరుడిగా పని చేస్తున్నాడు.
అయితే అతడ్ని ఓ కేసు విషయంలో అరెస్ట్ చేసారు. అదే ఈ వివాదానికి కారణమయ్యింది. తన అనుచరుడిపై తప్పుడు కేసు పెట్టారని , ఆ కేసు ను తక్షణమే ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను , ప్రభుత్వాన్ని హెచ్చరించాడు అమృత్ పాల్ సింగ్.
అంతేకాదు గంట తర్వాత వందలాది మంది అనుచరులతో పోలీస్ స్టేషన్ పైకి దాడికి పాల్పడ్డాడు. తల్వార్ లతో పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ మీదకు దాడికి పాల్పడంతో అదనపు బలగాలను అమృత్ సర్ కు తరలించారు.