భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు….. నీరాజనాలు అందుకుంటున్నారు. తాజాగా జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సమాయత్తం అవుతున్నారు మోడీ. డిసెంబర్ 1 , 2022 నుండి జీ 20 దేశాల అధ్యక్షుడు గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజాగా ఇండోనేషియాలో 2 రోజుల పాటు జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. బ్రిటన్ , చైనా , అమెరికా , రష్యా , ఇండోనేషియా, ఫ్రాన్స్, జర్మనీ , జపాన్, భారత్ తదితర కీలక దేశాలు జీ 20 దేశాల పేరుతో కీలక సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ శాంతి కోసం , అభివృద్ధి కోసం ఈ సమావేశాలు ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇండోనేషియాలో శిఖరాగ్ర సదస్సు జరుగగా వచ్చే ఏడాది 2023 లో భారత్ లో జీ 20 దేశాల సదస్సు జరుగనుంది. దాంతో ఆ సమావేశాలు మోడీ అధ్యక్షతన జరుగనున్నాయి.Bhala Modi ….. taking charge of G20 President