ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిగ్ ట్విస్ట్ ……. ఈడీ కి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు అరుణ్ రామచంద్ర పిళ్ళై. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేపు ఈడీ విచారణకు హాజరు అవుతోంది కవిత. ఈలోపే నేను ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఈడీ మీద రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించాడు అరుణ్ రామచంద్ర పిళ్ళై దాంతో ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగినట్లైంది.
ఎమ్మెల్సీ కవితకు నేను బినామీని . ఆమె చెప్పినట్లుగానే అన్నీ చేసానని …. నాకు స్వంతగా ఇందులో ఎలాంటి వాటా లేదని ఎన్ ఫోర్స్ మెంట్ ( ఈడీ ) కి స్టేట్ మెంట్ ఇచ్చాడు అరుణ్ రామచంద్ర పిళ్ళై. అతడి స్టేట్ మెంట్ ఆధారంగా కవితను ఇందులో చేర్చారు ఈడీ అధికారులు. అంతేకాదు కవితకు నోటీసులు ఇచ్చి రేపు విచారణ చేయనున్నారు. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు పిళ్ళై. దాంతో కోర్టు ఈడీ కి నోటీసులు జారీ చేసింది. సరిగ్గా కవితను విచారించే ముందే ఇలా ట్విస్ట్ నెలకొనడంతో రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.