భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అదరగొట్టింది. త్రిపుర , నాగాలాండ్ , మేఘాలయా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో విజయ డంఖా మోగించింది. త్రిపుర , నాగాలాండ్ లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది అయితే మేఘాలయలో మాత్రం హంగ్ ఏర్పడింది. దాంతో అక్కడ చక్రం తిప్పడానికి రంగం సిద్ధం చేస్తోంది బీజేపీ. త్రిపురలో మళ్ళీ బీజేపీ అధికారం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ ఆ పార్టీని ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మూడు రాష్ట్రాలలో కూడా సింగిల్ డిజిట్ కె పరిమితమైంది. బీజేపీ అఖండ విజయం సాధించడంతో కాషాయదళంలో సంబరాలు అంబరాన్నంటాయి.
Breaking News