
1995 లో గుజరాత్ లో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ అప్పటి నుండి అప్రతిహతంగా గుజరాత్ ను ఏలుతునే ఉంది. ఇప్పటి వరకు 27 సంవత్సరాలుగా అధికారం నిలబెట్టుకుంటూనే ఉంది. 1995 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురవేస్తూనే ఉంది.
వరుసగా ఏడోసారి కూడా భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో అధికారం చేపడుతోంది. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది. దాంతో ఈ అసెంబ్లీ కాలం పూర్తి అయ్యేసరికి కమ్యూనిస్ట్ ల రికార్డ్ ను బద్దలుకొట్టి భారతదేశ చరిత్రలోనే సరికొత్త చరిత్ర బీజేపీ ఆవిష్కరించనుంది. గుజరాత్ లో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో కాషాయదళంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ విజయంతో బీజేపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు.