37.5 C
India
Thursday, April 25, 2024
More

    BJP loses : వారెవ్వా బీజేపీ.. కర్ణాటకలో ఓడినా.. ఫుల్ స్కెచ్ తోనే ఉంది..

    Date:

    BJP loses
    BJP loses, pm modi

    BJP loses : బీజేపీ స్ట్రాటజీ ఎవరికీ అర్థం కానంతగా మారిపోయింది. మోడీ, షా ద్వయం పార్టీని దాదాపు 50 ఏళ్ల పాటు ప్రభుత్వంలో నిలిపితేనే దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపవచ్చని భావించారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తూ, వ్యూహాలు రచిస్తూ పార్టీని ఎప్పుడూ ప్రభుత్వంలో ఉంచుతున్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలు కూడా ఈ కోవలోనివే అంటున్నారు రాజకీయ నిపుణులు.. అదేంటి కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కదా.. అక్కడ ఏం స్ట్రాటజీ అంటూ సందేహిస్తున్నారా.. అయితే ఇక్కడ చూద్దాం..

    కర్ణాటక రాజకీయం గురించి బీజేపీకి ముందే తెలుసు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వ బదలాయింపు కామన్. ఈ సారి కూడా ప్రభుత్వం మారుతుంది. ఓటమి ఎలాగైనా ఖాయంగా కనిపిస్తుంది. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంది బీజేపీ. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినా కేవలం 0.1 శాతం ఓట్లు మాత్రమే కోల్పోయింది. ఇది ఎంపీ స్థానాలకు ఎసరు పెట్టిందని అందుకే ఓటమి పాలవుతామని తెలిసినా ఎంపీ స్థానాల కోసం తెరవెనుక రాజకీయం నడిపారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందులోనే చాలా సీట్లు కోల్పోయింది బీజేపీ. అయితే ప్రభుత్వ బదలాయింపు కామన్ కాబట్టి 0.1 శాతం ఓట్లు కాంగ్రెస్ కు మళ్లాయి. అయినా బీజేపీ గెలిచినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది ఎలాగంటే..

    2013 కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించగా, తర్వాత 2014లో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్యంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. 2018 ఎన్నికల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు మరో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కర్ణాటక, ఎంపీ, రాజస్థాన్ లలో అసెబ్లీ ఎన్నికలు జరిగాయి అందులో కాంగ్రెస్ గెలుపు సాధించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి ఈ మూడు రాష్ట్రాల నుంచే దాదాపు 70 సీట్ల వరకూ గెలిచింది. అంటే అక్కడ కాంగ్రెస్ కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సంబురపడుతుంటే బీజేపీ మాత్రం పార్లమెంట్ సీట్లు ఎగురవేసుకొని పోయింది.

    అసెంబ్లీ స్థానాల్లో గెలువలేమని తెలిసిన రాష్ట్రాలను పార్లమెంట్ కు సిద్ధం చేసుకుంటూ వెళ్తుంది బీజేపీ. ఈ స్ట్రాటజీతోనే కేంద్రంలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఫాం చేయగలిగింది. ఇప్పుడు కూడా దాదాపు చాలా సర్వేలు కేంద్రంలో బీజేపీ నాయకత్వమే వస్తుందని తేటతెల్లం చేశాయి. కర్ణాటకను కూడా బీజేపీ ఎంపీ సీట్ల కోసం వదులుకుందంటూ టాక్ వినిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...

    Actress Tamannaah : ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో నటి తమన్నాకు సమన్లు

    Actress Tamannaah : అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ స్ట్రీమింగ్ కేసులో నటి...

    BJP Madhavi Latha : బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతంటే..? – రూ. 218 కోట్లు ఉన్నట్లు వెల్లడి

    BJP Madhavi Latha : హైదరాబాద్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి...

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటే...

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...