
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్. కర్ణాటకకు చెందిన ఈ ఎంపీ తాజాగా రాహుల్ గాంధీ మీద అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ గురించి దుష్ప్రచారం చేస్తూ వ్యాక్సిన్ తీసుకోలేదని , అయితే రాత్రి వేళల్లో మాత్రం ఎవరికీ తెలియకుండా రహస్యంగా వ్యాక్సిన్ తీసుకున్నారని అందుకే వాళ్లకు పిల్లలు పుట్టరని …… తనకు పిల్లలు పుట్టరనే విషయం రాహుల్ గాంధీకి తెలుసు కాబట్టే పెళ్లి చేసుకోలేదని తీవ్ర వాఖ్యలు చేసాడు ఎంపీ కటీల్. ఇక కటీల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. మతి తప్పి మాట్లాడుతున్నారని , కటీల్ ఒక్కడే కాదని బీజేపీ లో ఉన్నవాళ్ళందరికి మతి తప్పిందని దుయ్యబడుతున్నారు.