
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగు చూడటంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పంజాబ్ సీఎం ఇంటి వద్ద లైవ్ బాంబ్ దొరకడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసారు. చండీఘడ్ లోని భగవంత్ మాన్ సింగ్ దగ్గరలో దొరికిన లైవ్ బాంబ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే బాంబ్ షెల్ పడిన సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా భగవంత్ మాన్ సింగ్ లేడు దాంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఈ దురాగతానికి పాల్పడ్డారని భావిస్తున్నారు పంజాబ్ పోలీసులు.






