ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేసాడు. సిసోడియాతో పాటుగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా ప్రకటించాడు. దాంతో ఆప్ సర్కారు లోని ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేసినట్లు అయ్యింది.
ఇది ఆప్ వర్గాలను మరింత షాక్ అయ్యేలా చేస్తోంది. మనీష్ సిసోడియా , సత్యేంద్ర జైన్ రాజీనామాలను వెంటనే ఆమోదించాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం స్కామ్ లో ఇటీవలే మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.