బ్రేకింగ్ న్యూస్ ……. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా ఎమ్మెల్సీ కవిత , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ల పేర్లను ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో చేర్చింది. దాంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతకొంత కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించింది. ఇక ఇప్పుడేమో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరుతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత , ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఛార్జ్ షీట్ లో నమోదు కావడం సంచలనంగా మారింది. ఈడీ ఛార్జ్ షీట్ లు దాఖలు చేయడంతో రాజకీయంగా మరింత వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత మొత్తంగా 10 ఐ ఫోన్ లను మార్చినట్లుగా ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం గమనార్హం.