ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ (100) కన్నుమూశారు. దాంతో మోడీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి మృతితో మోడీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇటీవలే జన్మదిన వేడుకలు జరుపుకుంది హీరా బెన్. తన తల్లి నిండు నూరేళ్లు జీవించి ఈశ్వర పాదాల చెంతకు చేరుకుందని, ఆమె జీవితం ఒక తపస్సు లాంటిదని ట్విట్టర్ లో పేర్కొన్నారు మోడీ. ఇటీవలే అనారోగ్యంతో అహమ్మదాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఇక చికిత్స అందించి లాభం లేదని చెప్పడంతో ఇంటికి తరలించారు. ఇంటికి వచ్చిన రోజునే ఆమె మరణించింది. గురువారం అర్ధరాత్రి హీరా బెన్ మరణించడంతో ఆ విషయాన్ని మోడీ స్వయంగా ప్రకటించారు. దాంతో మోడీ ని పలువురు ప్రముఖులు పరమర్శిస్తున్నారు. మోడీ తల్లి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022