
భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం యూనియన్ కార్ బైడ్ నుండి వసూల్ చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. అయితే కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటీషన్ ను కొట్టివేసింది. కేంద్రం వద్ద 50 కోట్లను బాధితులకు అందజేయాలని ఆదేశించింది. 1984లో భోపాల్ లో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుండి 7400 కోట్ల అదనపు నష్టపరిహారం వసూల్ చేయాలని భావించింది కేంద్రం. అందుకే 2010 లో సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. అయితే కేంద్రానికి షాక్ ఇస్తూ క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టేసింది.