కర్ణాటకలో సంచలనం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన 8 , 9 , 10 వ తరగతి స్టూడెంట్స్ తమ స్కూల్ బ్యాగ్ లలో కండోమ్ ప్యాకెట్లు పెట్టుకొని వచ్చారు. స్కూల్ బ్యాగ్ లను తనిఖీ చేయగా అందులో కండోమ్ ప్యాకెట్లతో పాటుగా సిగరెట్ ప్యాకెట్లు , అలాగే మద్యం బాటిళ్లు కూడా బయట పడ్డాయి దాంతో షాక్ అవ్వడం స్కూల్ యాజమాన్యం వంతు అయ్యింది. ఈ సంచలన సంఘటన కర్ణాటకలోని ఓ ప్రయివేటు పాఠశాలలో జరగడంతో అవాక్కైన టీచర్లు వెంటనే ఈ విషయాన్ని ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు చెప్పారు.
ఆ పిల్లలు చదువుతోంది కేవలం 8 , 9 , 10 వ తరగతి మాత్రమే కానీ అప్పుడే కండోమ్ ప్యాకెట్లను ఏకంగా స్కూల్ బ్యాగ్ లో తెచ్చుకుంటున్నారంటే ఏ స్థాయిలో నాశనం అయ్యారో గ్రహించవచ్చు. అలాగే సిగరెట్ ప్యాకెట్లు , మద్యం బాటిళ్లు కూడా. ఈమధ్య మద్యం బాటిళ్లు డిఫరెంట్ గా పోష్ గా వస్తున్న విషయం తెలిసిందే. దాంతో వాళ్ళ తెలివి తేటలను చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ స్కూల్ బ్యాగ్ లను తనిఖీ చేయాలని ఎందుకు అనుకున్నారంటే ….. స్కూల్ లో అవసరమైన బుక్స్ తెచ్చుకోలేదని చెబుతున్నారట కానీ బ్యాగ్ మాత్రం ఫుల్లుగా ఉండటంతో అసలు అందులో ఏమున్నాయి అని వెతికితే ఇవి బయట పడ్డాయి. అదన్న మాట అసలు సంగతి.