
ఎంతవరకు పోరాటం చేయడానికైనా సరే నేను సిద్దమే అని ప్రకటించాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సూరత్ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఒక రోజులోనే లోక్ సభ సభ్యత్వం రద్దు అంశం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తానని స్పష్టం చేసాడు రాహుల్ గాంధీ.
ఇక రాహుల్ గాంధీ అనర్హత అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని , దేశంలో ఎమర్జెన్సీ నెలకొందని , ఈ అంశంపై వెనక్కి తగ్గేది లేదని అందుకే రాజకీయంగా పోరాటం చేస్తామని అలాగే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ.