
ప్రధాని నరేంద్ర మోడీకి షాకిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై అలాగే ఇందిరాగాంధీ పై ఆమె కుటుంబం పై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబంపై మోడీ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సాధారణంగా తండ్రి ఇంటి పేరును పిల్లలకు అందునా మగవాళ్లకు మాత్రమే వారసత్వంగా వస్తుంది. ఇది భారతీయ సంప్రదాయం. అయితే నెహ్రూ కు ఇందిర మాత్రమే ఏకైక సంతానం అనే విషయం తెలిసిందే.