
దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి దాంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర , తెలంగాణ , కర్ణాటక , గుజరాత్ , తమిళనాడు , కేరళ రాష్ట్రాలను హెచ్చరించింది కేంద్రం. ఈ ఆరు రాష్ట్రాలలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని , తక్షణమే టెస్టులు పెంచాలని అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల కాలంలో జలుబు , దగ్గు , జ్వరం , ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్రమత్తం కాకపోతే కరోనా నాలుగో వేవ్ తప్పకపోవచ్చు అని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర , తెలంగాణ , కర్ణాటక , కేరళ , తమిళనాడు , గుజరాత్ లలో ఈ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.